బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. స్పందించిన రానా లీగల్ టీమ్

బెట్టింగ్ యాప్‌ల ప్రచారం(Promotion of betting apps)పై ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) టీమ్ స్పందించింది. రానా నైపుణ్యాధారిత గేమ్‌లకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని, అయితే ఆయన చేసిన ప్రకటన గడువు 2017తోనే ముగిసిందని వెల్లడించింది. బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై పోలీసులు కేసులు(Police case) నమోదు చేయడంతో పాటు, ఈ యాప్‌ల(App)కు ప్రచారం చేసిన వారిపై విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో రానా బృందం ఈ ప్రకటన చేసింది.

అన్ని విషయాలను పరిశీలించాకే..

రానా నైపుణ్యాధారిత గేమ్ యాప్‌ల(Skill-based game apps)కు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని రానా టీమ్ తెలిపింది. అదీ కూడా కొన్ని ప్రాంతాల వరకే ప్రసారమైందని వెల్లడించింది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ప్రచారకర్తగా ఆమోదం తెలిపారని పేర్కొంది. ఏదైనా ఒప్పందం చేసుకునే ముందు రానా లీగల్ టీమ్(Rana Leagal Team) ఆ సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుందని స్పష్టం చేసింది.

Rana Daggubati, Vijay Devarakonda and others booked for promoting betting  apps

చట్టపరమైన సమీక్ష తర్వాతే రానా యాప్ ప్రచారానికి అంగీకరించినట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ రానా ప్రచారకర్తగా వ్యవహరించడం లేదని ఆయన టీమ్ స్పష్టం చేసింది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించి రానా సహా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు, యూట్యూబర్లపై గురువారం (మార్చి 20) కేసు నమోదైన విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *