హరీశ్ రావు vs కోమటిరెడ్డి.. భూముల వేలంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ

ఏడో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై విపక్ష సభ్యుడు హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ బడ్జెట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) బాగా నీతులు చెప్పారని.. గతేడాది బడ్జెట్‌తో పోలుస్తూ ఆధికార పార్టీపై ఫైర్ అయ్యారు. గతడాది అంచనాలు పెంచి చూపించారని.. ఇప్పుడు బడ్జెట్(Budget) అంచనాలను తగ్గించారని ఎద్దేవా చేశారు.

కేవలం రూ.20 వేల కోట్లే చూపించారు: హరీశ్ రావు

అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ (Congres Party) ఇచ్చిన హామీలపై ఆయన నిలదీశారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ(Runamafi) చేస్తామని చెప్పారని, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా చూపించారని అన్నారు. ఈ క్రమంలోనే “చేతకాని వారెవరు.. మాట తప్పిందెవరు” అంటూ కామెంట్ చేశారు.

మా హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి: కోమటిరెడ్డి

దీంతో హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి(Komatireddy) కౌంటర్ ఇచ్చారు. గతంలో కంటే కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. BRS కమీషన్లకు కక్కుర్తిపడి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)ను రూ.7300 కోట్లకు అమ్మిందని ఫైరయ్యారు. కోకాపేట(Kokapet)లో భూములు వేల వేసిన చరిత్ర బీఆర్ఎస్‌దని, భూముల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. అంతేకాక గతంలో మద్యం దుకాణాల గుడువుకు 3 నెలల ముందే తీసుకున్నారని మండిపడ్డారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *