
ఏడో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై విపక్ష సభ్యుడు హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ బడ్జెట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) బాగా నీతులు చెప్పారని.. గతేడాది బడ్జెట్‌తో పోలుస్తూ ఆధికార పార్టీపై ఫైర్ అయ్యారు. గతడాది అంచనాలు పెంచి చూపించారని.. ఇప్పుడు బడ్జెట్(Budget) అంచనాలను తగ్గించారని ఎద్దేవా చేశారు.
కేవలం రూ.20 వేల కోట్లే చూపించారు: హరీశ్ రావు
అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ (Congres Party) ఇచ్చిన హామీలపై ఆయన నిలదీశారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ(Runamafi) చేస్తామని చెప్పారని, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా చూపించారని అన్నారు. ఈ క్రమంలోనే “చేతకాని వారెవరు.. మాట తప్పిందెవరు” అంటూ కామెంట్ చేశారు.
In Socio Econonic Outlook 2025 released by Congress Government,
In White Paper released in Assembly released by Congress Government,
Rs.4,22,000 crore Debts including Corporations were raised by BRS Government in 10 years..
It would be good for Telangana State if Congress… pic.twitter.com/WN8sEE6OSw— Dr.Krishank (@Krishank_BRS) March 21, 2025
మా హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి: కోమటిరెడ్డి
దీంతో హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి(Komatireddy) కౌంటర్ ఇచ్చారు. గతంలో కంటే కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. BRS కమీషన్లకు కక్కుర్తిపడి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)ను రూ.7300 కోట్లకు అమ్మిందని ఫైరయ్యారు. కోకాపేట(Kokapet)లో భూములు వేల వేసిన చరిత్ర బీఆర్ఎస్‌దని, భూముల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. అంతేకాక గతంలో మద్యం దుకాణాల గుడువుకు 3 నెలల ముందే తీసుకున్నారని మండిపడ్డారు.