Video Viral : మహేశ్ బాబు వారసుడొచ్చాడు.. గౌతమ్ యాక్టింగ్ అదుర్స్

టాలీవుడ్ లో నెపోటిజం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుల వారసులు సినిమాల్లోకి వచ్చి తమ సత్తా చాటుతున్నారు. ఇక వారి వారసులు కూడా త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యాక్టింగ్ ఇరగదీసిన గౌతమ్

అయితే వారికో గుడ్ న్యూస్ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ (Gautham Ghattamaneni) ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. అమెరికాలో రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ లోని యూనివర్సిటీలో యాక్టింగ్ నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తాజాగా అతడు చేసిన ఓ స్కిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ వారసుడొచ్చేస్తున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. యాక్టింగులో భాగంగా తోటి విద్యార్థినితో కలిసి గౌతమ్ ఒక స్కిట్ చేశాడు.

మహేశ్ బాబు వారసుడొచ్చాడు

ఓ అమ్మాయితో కలిసి గౌతమ్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లు కనిపించాడు. వీడియో ప్రారంభంలో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ప్రశాంతంగా కనిపించిన గౌతమ్ కొద్ది క్షణాల్లోనే ఆగ్రహావేశాలకులోనై కోపంగా డైలాగ్స్ చెప్పాడు. ఈ వీడియోలో గౌతమ్ నటన చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గౌతమ్ యాక్టింగ్ ఇరగదీశాడంటూ కామెంట్లు పెడుతున్నాడు. మహేశ్ బాబు వారసుడు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తాడంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక గౌతమ్ గతంలో మహేశ్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే (One Nenokkadine)’ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగానూ చేసిన విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *