
టాలీవుడ్ లో నెపోటిజం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుల వారసులు సినిమాల్లోకి వచ్చి తమ సత్తా చాటుతున్నారు. ఇక వారి వారసులు కూడా త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#GautamGhattamaneni shines at NYU Tisch School of the Arts!
Gautam babu acted in mime created by his fellow students
Wishing him the best on this creative journey! ✨🎭 @urstrulyMahesh pic.twitter.com/iPq6DrfDuk
— SSMB EMPIRE FC 🦁 (@ssmb_freaks) March 21, 2025
యాక్టింగ్ ఇరగదీసిన గౌతమ్
అయితే వారికో గుడ్ న్యూస్ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్ (Gautham Ghattamaneni) ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. అమెరికాలో రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ లోని యూనివర్సిటీలో యాక్టింగ్ నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తాజాగా అతడు చేసిన ఓ స్కిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ వారసుడొచ్చేస్తున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. యాక్టింగులో భాగంగా తోటి విద్యార్థినితో కలిసి గౌతమ్ ఒక స్కిట్ చేశాడు.
” For those of u who r new to this game !! this was a ‘blink and you lose’ competition!! As u can see GG wasn’t able to hold his laughter or his eyes open♥️♥️♥️ ”
Namrata Via Instagram @urstrulymahesh #Maheshbabu pic.twitter.com/75Yx3BX5Bn— Team Mahesh Babu (@MBofficialTeam) May 18, 2020
మహేశ్ బాబు వారసుడొచ్చాడు
ఓ అమ్మాయితో కలిసి గౌతమ్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లు కనిపించాడు. వీడియో ప్రారంభంలో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ప్రశాంతంగా కనిపించిన గౌతమ్ కొద్ది క్షణాల్లోనే ఆగ్రహావేశాలకులోనై కోపంగా డైలాగ్స్ చెప్పాడు. ఈ వీడియోలో గౌతమ్ నటన చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గౌతమ్ యాక్టింగ్ ఇరగదీశాడంటూ కామెంట్లు పెడుతున్నాడు. మహేశ్ బాబు వారసుడు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తాడంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక గౌతమ్ గతంలో మహేశ్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే (One Nenokkadine)’ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగానూ చేసిన విషయం తెలిసిందే.