జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన రాబిన్ హుడ్ (Robinhood) సినిమా మార్చి 28వ తేదీన విడుదలకు రెడీ అయింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ వరుసగా మూడు చిత్రాలు లైన్లో పెట్టాడు.
సమ్మర్ లో తమ్ముడు
రాబిన్ హుడ్ చిత్రం పూర్తి కాగానే నితిన్ తమ్ముడు (Thammudu) మూవీలో నటించనున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కు ఎంత ఇష్టమో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన ఫేవరెట్ హీరో క్లాసిక్ హిట్ మూవీ టైటిల్ తమ్ముడుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత నితిన్ బలగం (Balagam) ఫేం వేణు యెల్దండితో కలిసి ఎల్లమ్మ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ కోసం హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు మేకర్స్.
ఇష్క్ కాంబో రిపీట్
ఇక ఎల్లమ్మ (Yellamma) సినిమా సెట్స్ కు కూడా వెళ్లకముందే నితిన్ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . ఇష్క్ సినిమాతో తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) తో నితిన్ ఓ సినిమా చేయనున్నాడట. సై తరహా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందించనున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






