
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannah Bhatia) తాజాగా ఓదెల-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ సంపది నంది నిర్మాతగా రూపొందిన ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 17వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ (Odela 2 Release Date) కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తమన్నా ఉగ్రరూపం చూపిస్తోంది. ఇక మొత్తం ఎరుపు రంగులో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి.
H.E I.S C.O.M.I.N.G..
🕉️🔱✨#Odela2OnApril17Are you ready to experience him?@tamannaahspeaks @ashokalle2020 @ihebahp @ImSimhaa @AJANEESHB @soundar16 @Neeta_lulla @SampathNandi_TW @creations_madhu #DiMadhu @abbs_studio @crbobbymusic pic.twitter.com/bEnhFQExwS
— B AJANEESH LOKNATH (@AJANEESHB) March 22, 2025
ఏప్రిల్ 17న ఓదెల-2
2021లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా ఓదెల-2 తెరకెక్కింది.. అశోక్ తేజయే(Ashok Tejay) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో తమన్నా భాటియా నాగసాధు పాత్రలో కనిపించనుంది. మధు క్రియేషన్స్(Madhu Creations) బ్యానర్‌పై సంపత్ నంది టీమ్ వర్స్‌పై మధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ విడుదలై అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అలాగే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
జోరు మీదున్న తమన్నా
ఇక తమన్నా సినిమాల సంగతికి వస్తే టాలీవుడ్ కు అడుగుపెట్టి దశాబ్ధకాలం పూర్తి చేసుకున్నా తమన్నా హవా మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ఈ భామ ప్రస్తుతం అక్కడే సెటిల్ అయింది. హిందీలో వరుస సినిమాలు.. చేస్తూ సత్తా చాటుతోంది. గ్లామరస్ పాత్రలకే కాకుండా ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటిస్తోంది. మొట్టమొదటి సారిగా తమన్నా నాగసాధు పాత్రలో ఓదెల-2లో కనిపించబోతోంది. ఇక ఇటీవలే ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ (Vijay Varma)తో విడిపోయినట్లుగా బాలీవుడ్ మీడియా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.