
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోహీరోయిన్లు వచ్చినా.. కొన్ని జంటలు మాత్రం వెండితెరపై ఎన్నిసార్లు చూసినా ముచ్చటేస్తుంది. అందుకే నిర్మాతలు కూడా వారిని మళ్లీ మళ్లీ తమ సినిమాల్లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఇప్పటికే చాలా జంటలు తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్నాయి. 90స్ లో అలా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన హిట్ పెయిర్స్ లో ఒకటి జగపతిబాబు (Jagapathi Babu), ఆమని (Aamani) జంట. వీరిద్దరు కలిసి శుభలగ్నం, మావిచిగురు, తీర్పు వంటి సినిమాల్లో నటించి సూపర్ హిట్ పెయిర్ గా నిలిచారు.
మళ్లీ కలిసిన హిట్ పెయిర్
ముఖ్యంగా శుభలగ్నం (Subhalagnam) చిత్రంలో ఈ జంట నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో కోటి రూపాయలకు భర్త(జగపతిబాబు)ను అమ్మేసే పాత్రలో నటి ఆమని తన నటనతో మెస్మరైజ్ చేశారు. ఒకప్పుడు తమ నటనతో ఫిదా చేసిన జగపతిబాబు, ఆమని ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తెలుగు చిత్రపరిశ్రమలో రాణిస్తున్నారు. అయితే చాలా ఏళ్ల తర్వాత పటేల్ సార్ (Patel Sir) సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట మళ్లీ ఓ వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగు సెట్ లో ఈ ఇద్దరు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సరదాగా గడిపారు. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మళ్లీ అమ్మేస్తావా నన్ను
తాజాగా షూటింగు సెట్ నుంచి జగపతిబాబు (Jagapathi Babu Aamani Video) ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో జగపతిబాబు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోగా.. నటి ఆమని గొడుగు పడుతూ ఆయనకు టచప్ చేస్తూ కనిపించారు. మేకప్ చేయమంటే బొట్టు పెడుతున్నావా ఏంటి.. నీవల్ల కాకపోతే చెప్పు మేనేజర్ కు చెప్పి మార్చేస్తా అంటూ జగ్గూభాయ్ చికాకు పడుతుంటే.. వద్దు సార్ ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆమని బతిలాడటం ఇందులో చూడొచ్చు. ఇక అద్దం చూపిస్తూ మేకప్ బాగా చేశానా సార్ అని ఆమని అడగ్గా.. నీ ముఖంలాగే ఉందంటూ జగ్గూభాయ్ కౌంటర్ ఇచ్చాడు. అదేంటి సార్ అని ఆమని అడగగా.. ఏంటి మళ్లీ నన్ను కోటి రూపాయలకు అమ్మేస్తావా అంటూ జగపతిబాబు అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
View this post on Instagram