శుక్రవారం వచ్చేసింది. వినోదాలు వడ్డించేందుకు పలు సినిమాలు వచ్చేశాయి. రాబిన్ హుడ్ (RobinHood), మ్యాడ్ స్క్వేర్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ముఖ్యంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్వ్కేర్ (MAD Square)’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 28న) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?
సునిల్ సర్ ప్రైజ్
ఇవాళే థియేటర్లకు వచ్చిన మ్యాడ్ స్క్వేర్ (MAD Square Review) సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో కామెడీ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. మూవీ ఫస్టాఫ్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ చిత్రంలో లడ్డూ పాత్రకు తండ్రిగా నటించిన మురళీధర్ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లడ్డూ పెళ్లి సీక్వెన్స్ నవ్వులు పంచిందని.. ఈ పెళ్లి సందడి అంతా ఇంతా కాదంటూ మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. సునిల్ కామియో సర్ ప్రైజ్ చేస్తుందని ఇంకొకరు రాసుకొచ్చారు.
#MadSquareReview ⭐️⭐️⭐️/5#MADSquare is a lighthearted comedy entertainer with a crisp runtime, delivering fun moments despite some forced sequences.
Highlights:
▪️Decent timepass comedy entertainer
▪️Has a feel and vibe similar to Jathi Ratnalu rather than MAD 1
▪️Features… pic.twitter.com/HPBjjMaFJh— TollywoodRulz (@TollywoodRulz) March 28, 2025
ఫస్ట్ డే పాజిటివ్ టాక్
మ్యాడ్ స్క్వేర్ మూవీ యూత్ కు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుందని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇక భీమ్స్ (Bheems Songs) సాంగ్స్ మరోసారి యువతను ఉర్రూతలూగిస్తాయని ప్రేక్షకులు అంటున్నారు. కొన్ని సీన్స్ మాత్రం కావాలని ఏదో చొప్పించినట్లుగా ఉన్నాయని.. అవి లేకపోయినా సినిమా బాగుండేదని ఓ నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ డే టాక్ చాలా పాజిటివ్ గా కనిపిస్తోంది. మరి కలెక్షన్లు ఎలా వస్తాయో చూడాలి.
#MadSquare is a winner through and through with situational and dialogue comedy hitting top gear. Kalyan Shankar stages a non nonsense fun and entertaining sequel very successfully. Top ROFL moments in “Laddu gadi pelli” and interactions between Bhaaaiiiiii and Laddu gadi daddy.… pic.twitter.com/jqCn5uNGgS
— …. (@ynakg2) March 27, 2025
థియేటర్లో నవ్వుల పువ్వులు
ఈ సినిమా విషయానికొస్తే 2023లో విడుదలైన ‘మ్యాడ్ (MAD)’ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. నార్నే నితిన్ (Narne Nithin) నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘మ్యాడ్’లో రామ్ నితిన్‌తో పాటు సంగీత్ శోభన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. సెకండ్ పార్ట్ లోనూ దాదాపు ఈ నటులే ఉన్నారు. ఇక తొలి పార్ట్ కంటే, సెకండ్ పార్ట్ డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని మేకర్స్ చెప్పినట్లుగానే థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్ మూవీ నవ్వులు పూయిస్తోందని నెటిజన్లు అంటున్నారు.






