Robinhood Twitter Review : కిక్కిచ్చిన కామెడీ.. అదిరిన ఫస్టాఫ్

ఛలో, భీష్మ సినిమాలతో  కామెడీ, మాస్ ఎంటర్టైనర్‌ డైరెక్టర్‌గా వెంకీ కుడుముల (venky kudumula) మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు యంగ్ హీరో నితిన్ (Nithin)తో కలిసి రాబిన్ హుడ్ (Robinhood) సినిమా తీశాడు. శ్రీలీలీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మార్చి 28వ తేదీ (ఇవాళ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుంచి డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఇక ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించారు. ప్రమోషన్స్ లో వార్నర్ కూడా చాలా యాక్టివ్ గా కనిపించాడు. మరి ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పించిందా చూద్దామా..?

ఫ్రెష్ కామెడీ అదిరింది

ఇవాళే థియేటర్లలో విడుదలైన రాబిన్ హుడ్ (Robinhood Twitter Review) సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు రివ్యూ ఇస్తున్నారు. ఈ చిత్రం మొదటి షోను చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలను నెట్టింట వ్యక్తపరుస్తున్నారు. అయితే చాలా మంది నెటిజన్లు ఈ చిత్రం ఫస్టాఫ్ అదిరిపోయిందని చెబుతున్నారు. మూవీలో కామెడీ చాలా ఫ్రెష్ గా ఉందని అంటున్నారు. డార్క్ కామెడీ కాకుండా లైట్ కామెడీతో ఫన్ పుట్టించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్స్, ఇంటర్వెల్ బోరింగ్ గా ఉన్నాయని కొందరు అంటున్నారు.

డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదుర్స్

అయితే సెకండాఫ్ కాస్త బోర్ గా అనిపించిందని ఓ నెటిజన్ అన్నాడు. ఓవరాల్ గా మాత్రం సినిమా ఓకే అని చెప్పాడు. ఫస్టాఫ్ కామెడీ మాత్రం అదిరిపోయిందని చాలా మంది ఆడియెన్స్ అంటున్నారు. నితిన్, శ్రీలీల (Sreeleela) చాలా యాక్టివ్ గా కనిపిస్తారని చెప్పారు. వెంకీ కుడుముల కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ అయిందని చెబుతున్నారు. అదిదా సర్ ప్రైజు సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లోల ఈలలే ఈలలు. ఇక డేవిడ్ వార్నర్ (David Warner) ఎంట్రీ సమయంలో థియేటర్లో ఫ్యాన్స్ పూనకాలు పెట్టారట. మొత్తానికి రాబిన్ హుడ్ సినిమా ఓ కామెడీ ఎంటర్టైనర్ అని ఫ్యామిలీతో జాలీగా ఎంజాయ్ చేయొచ్చని చెబుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *