PM Modi: శ్రీలంకకు చేరుకున్న మోదీ.. రేపు ఆ దేశాధ్యక్షుడితో భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పాటు థాయ్‌లాండ్‌(Thailand)లో పర్యటించిన ఆయన.. 3 రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక(Srilanka)కు వెళ్లారు. శుక్రవారం రాత్రి కొలొంబో(Colombo)కి చేరుకున్న ఆయనకు శ్రీలంక మంత్రులు ఘనస్వాగతం పలికారు. కాగా ఈ పర్యటనలో భారత్, శ్రీలంక మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రక్షణ(Defence), ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం(Health), వాణిజ్య రంగాల(Commercial sectors)కు సంబంధించి ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరగనున్నాయి. కాగా గతేడాది వామపక్ష కూటమికి చెందిన అనుర కుమార దిస్సనాయకే(Anura Kumar Dissanayake) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.

8 అవగాహన ఒప్పందాలపై చర్చ

అంతకుముందు థాయ్‌లాండ్‌లో జరిగిన బిమ్‌స్టెక్ సమావేశం(BIMSTEC Summit) అనంతరం ప్రధాని మోదీ నేరుగా శ్రీలంక చేరుకున్నారు. గత డిసెంబర్‌లో దిస్సనాయకే న్యూఢిల్లీ పర్యటకు వచ్చారు. ప్రధాని మోదీ పర్యనటలో 8 అవగాహన ఒప్పందాలపై సంతకం చేయాలని భావిస్తున్నారు. ఈ పర్యటనకు మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval), విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఉన్నారు. శనివారం మోదీ కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆ దేశాధ్యక్షుడు దిస్సనాయకేతో అధికారిక చర్చల్లో పాల్గొంటారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *