అక్కినేని అఖిల్ (Akkineni Akhil) నుంచి సినిమా వచ్చి దాదాపు రెండు మూడేళ్లవుతోంది. సురేందర్ రెడ్డితో ఏజెంట్ (Agent) సినిమా తర్వాత ఈ యంగ్ హీరో నుంచి మరో చిత్రం రాలేదు. అయితే ఇటీవల ఆయన ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. సైలెంటుగా రెండు సినిమాలకు షూటింగులు చేసేస్తున్నాడంటూ నెట్టింట న్యూస్ వస్తోంది. కనీసం పూజా కార్యక్రమాల విషయం కూడా బయటకు తెలియనివ్వట్లేదు.
#Akhil6 – April 8th – 💥💥💥
— Naga Vamsi (@vamsi84) April 5, 2025
అయ్యగారి బర్త్ డే రోజు అప్డేట్
అయితే అఖిల్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఏప్రిల్ 8వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించి అప్డేట్ రానుంది. అఖిల్-6 మూవీ నుంచి నిర్మాత నాగవంశీ బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore) దర్శకత్వంలో అఖిల్ తన ఆరో సినిమాలో నటిస్తున్నాడు. చిత్తూరు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న.. ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తోంది.
అఖిల్-6 టైటిల్ ఇదేనా?
ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను అఖిల్ పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8వ తేదీన ప్రకటిస్తామని తాజాగా నాగవంశీ (Naga Vamsi) ట్వీట్ చేశారు. దీంతో ఆరోజు ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ సినిమాకు ‘లెనిన్ (Lenin)’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






