Bigg Boss : షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్

ఈ మధ్య సెలబ్రిటీల చుట్టూ వివాదాలు ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. పలువురు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి.. ఇంకొందరు డ్రగ్స్ కేసు.. మరికొందరు హత్య ఆరోపణలు.. ఇలా రకరకాలుగా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. కేసుల్లో ఇరుక్కుని జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. తాజాగా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్టయ్యాడు. తన ఇంటి ముందు కారు పార్క్ చేశారని జడ్జి కుమారుడిపై దాడికి పాల్పడిన కేసులో అతడు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇంతకీ అతడు ఎవరంటే..?

జడ్జి కుమారుడిపై దాడి

తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ (Tamil Bigg Boss) దర్శన్ ఈ షోతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఇతడు ఓ జడ్జి కుమారుడిపై దాడి చేసి కటకటాలపాలయ్యాడు. గురువారం రోజున దర్శన్ (Tamil Actor Darshan) ఇంటి వద్ద ఉన్న ఓ టీ షాపు వద్దకు మద్రాస్ హైకోర్టు జడ్జి కుమారుడు, అతడి భార్య, అత్తతో కలిసి టీ తాగేందుకు వచ్చాడు. అయితే తన కారును ఆ వ్యక్తి దర్శన్ ఇంటి ముందు పార్క్ చేయడంతో దర్శన్ అతడితో గొడవ పడ్డాడు.

చిన్న గొడవ ఠాణా వరకు

ఈ క్రమంలో వాగ్వాదం ఘర్షణకు దారి తీయడంతో దర్శన్ జడ్జి కుమారుడిపై దాడి చేశాడు. ఈ క్రమంలో పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారు. అయితే జడ్జి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ ను, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. చిన్న కారు పార్కింగ్ విషయంలో వచ్చిన గొడవ చివరకు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లింది. శ్రీలంకకు చెందిన దర్శన్  తమిళ బిగ్ బాస్ తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *