అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akkineni Akhil) నుంచి కొత్త మూవీ అప్డేట్ వచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత అఖిల్ నెక్ట్స్ మూవీని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. 2023లో వచ్చిన ‘ఏజెంట్(Agent)’ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత ఈ అక్కినేని యంగ్ హీరో ఓ సాలీడ్ ప్రాజెక్టుతో వస్తున్నాడు. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు(Director Murali Kishore Abburu) దర్శకత్వంలో ఓ రొమాటింగ్ యాక్షన్ థ్రిల్లర్‌లో అభిమానుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.
రాయలసీమ నేపథ్యంలో..
ఇవాళ (ఏప్రిల్ 8) అఖిల్ బర్త్ డే(Akhil’s Birthday) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్(Title Glimpse)ను మేకర్స్ కాసేపటి క్రితం రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘లెనిన్(Lenin)’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోలో అఖిల్ రఫ్ లుక్‌తో ఊరమాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో సాగే ప్రేమ కథకు యాక్షన్ జోడించి ‘లెనిన్’ మూవీగా రూపొందిస్తున్నారు. ఇక ఈ గ్లింప్స్‌లో అఖిల్ చెబుతున్న పవర్ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Happy birthday, Dear @AkhilAkkineni8💐❤️
As you enter this year, praying that the Universe bless you with all its power and glory so that you may shine!! 💥Very happy to collaborate with you @vamsi84 😊
Thank you team Lenin for the superb glimpse!!
Dear Akkineni fans, thank you… pic.twitter.com/VkoerH5Koi— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 8, 2025
ఫుల్ ధీమాతో అఖిల్ ఫ్యాన్స్
ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్గా నటిస్తోంది. రూరల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా అఖిల్ హిట్ కొడతాడని అక్కినేని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. మరి ఈ లవ్ యాక్షన్ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.








