Ram Pothineni : హీరో రామ్ తో డేటింగ్.. రింగ్ చూపిస్తూ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni) ఓ హీరోయిన్ తో డేటింగులో ఉన్నాడంటూ చాలా రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ మహేశ్ బాబు.పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘RAPO 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే (bhagyashri borse) నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి.

Image

నటితో రామ్ డేటింగ్

అయితే రామ్, భాగ్యశ్రీ డేటింగ్(Ram bhagyashri borse News) లో ఉన్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు.. వీళ్లిద్దరికి సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తాజాగా భాగ్యశ్రీ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రామ్ తో డేటింగ్ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.

Image

భాగ్యశ్రీ క్లారిటీ

నెట్టింట ఓ నెటిజన్ మీ చేతికి ఉన్న రింగ్ ఎవరు తొడిగారు? అని భాగ్యశ్రీని అడిగారు. దీంతో ఆమె.. ఇది ఎవరు నాకు తొడగలేదు.. ఈ రింగ్ నేను కొనుక్కున్నా అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో రామ్ తో డేటింగ్ పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. కానీ రామ్, భాగ్యశ్రీ ఇటీవల వెకేషన్ కు వెళ్లారు. అయితే ఈ ఇద్దరూ కలిసే వెళ్లారని.. ఒకే చోట ఉన్నట్లు ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *