
కోలీవుడ్ నటుడు విష్ణువిశాల్ (Vishnu Vishal), బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల (Jwala Gutta) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టినట్లు వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు నాడు మా ఇంటికి మహాలక్ష్మి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దేవుడిచ్చిన గిఫ్టుగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి’’ అని తెలుపుతూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
We are blessed with a BABY GIRL..
Aryan is an elder brother now…Its our 4th wedding anniversary today…
On the same day we welcome this gift from the Almighty…😍Need all your love and blessings….😍😍@Guttajwala 😍😍 pic.twitter.com/vSAPVMXKN8
— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) April 22, 2025
ఈ పెళ్లి రోజు మాకు చాలా స్పెషల్
ఇక ఈ జంట(Vishnu Vishal Gutta Jwala)కు నెట్టింట ప్రముఖులు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2021 ఏప్రిల్ 22వ తేదీన ఈ జంట వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత పెళ్లి రోజునే పాప పుట్టడం ఎంతో స్పెషల్ అంటూ నెటిజన్‌లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
క్రికెట్ Weds బ్యాడ్మింటన్
క్రికెట్‌లో కొంతకాలం కెరీర్ తర్వాత 2009లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విష్ణు విశాల్. ‘ఎఫ్‌ఐఆర్ (FIR Film)’ సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఆయన మట్టికుస్తీతో అలరించారు. ఇక గతేడాది విడుదలైన రజనీకాంత్ ‘లాల్ సలాం (Lal Salam)’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరించారు. మరోవైపు భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి అలరించింది.