
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్(Paresh Rawal) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘శంకర్ దాదా MBBS’, ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలతో ఆయన టాలీవుడ్(Tollywood)లో చాలా మందికి సుపరిచితుడయ్యాడు. అటు బాలీవుడ్(Bollywood)లోనూ అనేక సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. తన మోకాలికి గాయం అయ్యిందని, దాని నుంచి కోలుకోవడానికి తాను యూరిన్(Urine) తాగినట్టు చెప్పుకొచ్చాడు. తాజాగా పరేష్ వ్యాఖ్యలకు బాలీవుడ్ నటి అను అగర్వాల్(Anu Agarwal) మద్దతు తెలిపింది. తాను కూడా యూరిన్ తాగినట్లు హీరోయిన్ అను అగర్వాల్ తెలిపింది.
Remember Anu Aggarwal the Original Aashiqui Girl?? Watch her BRILLIANT take on Paresh Rawal viral Drinking Urine therapy ❤️😍 pic.twitter.com/XZYe99jmFG
— Rosy (@rose_k01) May 3, 2025
బాలీవుడ్ బ్లాక్బస్టర్ సినిమా ఆషికి(Aashiqui) చిత్రం 1990లో విడుదల కాగా, ఆ సినిమాకు ప్రేక్షకులు ఎంతో మంది ఫిదా అయ్యారు. అందులో అను అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాను యారిన్ తాగడం గురించి మాట్లాడుతూ.. యూరిన్ తాగడం యోగా(Yoga)లో ఒక ముద్ర అని చెప్పుకొచ్చారు. యూరిన్ తాగడం వల్ల ముఖం మీద ముడతలు పోతాయని పేర్కొంది.
రెండింటిలో దేనిని నమ్ముతారు?
‘‘చాలా మందికి యూరిన్ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియదు. తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నారో… లేదంటే అవగాహన లేదో తెలియదు కాని యూరిన్ తాగడాన్ని ఆమ్రోలి(Amroli) అంటారు. ఇది యోగాలో ఒక ముద్ర కాగా, దానిని నేను ప్రాక్టీస్ చేశాను. అది వ్యక్తిగతంగా, నాకు ఆరోగ్యపరంగా ఎంతో ప్రయోజనం చేకూర్చింది” అని చెప్పుకొచ్చింది. అయితే వైద్యులు(Doctors) తాగొద్దంటున్నారు కదా అని అడగ్గా.. సైన్స్(Science) ఎప్పటిది? 200 ఏళ్లు? యోగా(Yoga) 1000 ఏళ్ల నుంచి ఉంది. మీరు రెండింటిలో దేనిని నమ్ముతారు అని తిరిగి ప్రశ్నించిందీ సీనియర్ నటి.