నైతికంగా దిగజారింది కాంగ్రెస్ పార్టీనే.. CM వ్యాఖ్యలకు KTR కౌంటర్

తెలంగాణ ఆర్థిక పరిస్థితి(Economic situation of Telangana)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) చేసిన కామెంట్స్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్విటర్ (X) వేదికగా స్పందించారు. తెలంగాణ దివాలా తీసిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్(Congress) పార్టీని, CMని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రేపు (May 6) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం(Press Meet) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నైతికంగా దిగజారింది మీరే..

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయలేదని KTR స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై CM రేవంత్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. “రాష్ట్రం దివాలా తీయలేదు. మిస్టర్ ‘చీప్ మినిస్టర్(Cheap Minister)’. నిజానికి మేధోపరంగా దివాలా తీసింది, నైతికంగా దిగజారింది మీరూ, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీయే” అంటూ ఘాటుగా విమర్శించారు.

కాగా కార్మికులు సమరం చేయడం వల్ల రాష్ట్రం దివాలా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, గత ప్రభుత్వం ఉద్యోగులకు రూ.9వేల కోట్లు పెండింగ్ పెట్టిందని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ గత BRS పాలనపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *