Bobm Threat: HYD శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపులు!

హైదరాబాద్‌(Hyderabad)లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో కలకలం రేగింది. ఎయిర్ పోర్టు(Airport)లో బాంబు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి శుక్రవారం సాయంత్రం అధికారులకు ఈ-మెయిల్(E-Mail) ద్వారా బెదిరింపు సందేశం అందింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే తనిఖీలు చేపట్టారు.బాంబు బెదిరింపు ఈ-మెయిల్ అందిన వెంటనే, శంషాబాద్ విమానాశ్రయ అధికారులు పోలీసులకు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF)కు సమాచారం అందించారు.

ఎయిర్ పోర్టులో విస్తృతంగా తనిఖీలు

దీంతో పోలీసులు,CISF సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన రంగంలోకి దిగారు. డాగ్‌ స్క్వాడ్‌(Dog Squad), బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌(Bomb Disposal Squad) బృందాలను రప్పించి విమానాశ్రయ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల రాకపోకలు, లగేజీ స్కానింగ్ పాయింట్లు(Luggage scanning points), పార్కింగ్ ప్రదేశాలు సహా కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. అయితే, ఈ బెదిరింపు ఈ-మెయిల్ నిజమైనదా లేక కేవలం ఆకతాయిల చర్యా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా భారత్-పాకిస్థాన్(India-Pakistan War Crisis) సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో భద్రతను పటిష్ఠం చేశారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *