పాన్ ఇండియా మూవీస్ డైరెక్టర్ అట్లీ(Director Atlee)కి మరో ఘనత దక్కింది. చెన్నైకి చెందిన సత్యభామ యూనివర్సిటీ(Satyabhama Univercity) ఆయనకు డాక్టరేట్(Doctorate) ప్రకటించింది. జూన్ 14న జరిగే యూనివర్సిటీ 35వ స్నాతకోత్సవ వేడుకలో అట్లీకి డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు(Wishes) తెలియజేస్తున్నారు. కోలీవుడ్(Kollywood)లో ప్రముఖ దర్శకుడుగా పేరొందిన అట్లీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.
Director #Atlee to receive Honorary Doctorate at Sathyabama University’s 34th Convocation.
A proud moment recognizing his contribution to cinema. 👏🎓#HonoraryDoctorate #SathyabamaUniversity #ProudMoment #IndianCinema pic.twitter.com/pbce2E28RE— Vigneshwar (@Vignesh67167445) May 19, 2025
టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు
కాగా రాజారాణి(Raja Rani), తేరి (పోలీసోడు), మెర్సల్ (Adirindi), బిగిల్ (Whistle) చిత్రాలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్(Tollywood)లోనూ మంచి గుర్తింపు పొందారు. షారూక్ ఖాన్ హీరోగా ఆయన తెరకెక్కించిన జవాన్(Jawan) చిత్రం రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్(Allu Arjun)తో ఆయన మూవీ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.






