బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor), స్టార్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పరమ్ సుందరి(Param Sundari)’. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్(First look Teaser)ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం ‘పరం’ (Sidharth Malhotra), ‘సుందరి’ (Janvi Kapoor) మధ్య ప్రేమకథ(Lovestory)గా సాగనుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్, కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి.

జులై 25న థియేటర్లలోకి..
ఈ టీజర్‌లో కేరళ(Kerala)లోని అందమైన బ్యాక్‌వాటర్స్, హౌస్‌బోట్‌ల నేపథ్యం అద్భుతంగా ఉంది. సిద్ధార్థ్, జాన్వీ ఒక బైక్‌పై రొమాన్స్(Romance) చేస్తూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సోను నిగమ్(Sonu Nigam) ఆలపించిన మధురమైన పాట హైలైట్‌గా నిలిచింది. దినేశ్ విజన్(Divesh Vijan) నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తుషార్ జలోటా(Director Tushar Jalota) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్(Rajiv Khandelwal), ఆకాశ్ దహియా(Akash Dahiya) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జులై 25న థియేటర్లలోకి రానుంది.






