Rana Naidu Season 2: రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది

విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’కు (Rana Naidu)కు కొనసాగింపుగా (Rana Naidu Season 2) రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) జూన్‌ 13 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సీజన్2 ట్రైలర్‌ను విడుదల చేసింది. తన కుటుంబం కోసం దేనికైనా తెగించే వ్యక్తిగా వెంకటేశ్ కనిపించనున్నారు. అయితే, పార్ట్‌ 1లో కాస్త బోల్డ్‌ కంటెంట్‌ ఉందని విమర్శలు రావడంతో సీక్వెల్‌ దానిని కాస్త తగ్గించారు. ప్రస్తుతం ట్రైలర్‌ లోనూ అలాంటి సీన్స్‌ లేవు.

కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ వర్మ, అభయ్‌ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో అర్జున్‌ రాంపాల్, సుర్వీన్‌ చావ్లా, కృతి కర్బంద, అభిషేక్‌ బెనర్జీ, డినోమోరియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూన్ 13 నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే మొదటి సిరీస్‌ను ఎక్కువ మంది వీక్షించినా బోల్డ్‌ కంటెంట్‌ కారణంగా విమర్శలు కూడా వచ్చాయి. కానీ చాలా మంది యువతకు ఈ సిరీస్ నచ్చింది. అందుకే పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *