లక్కీ భాస్కర్ హిరో దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఆ హీరోయిన్తో అదే నా కోరిక..!

సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న నటులలో మలయాళ ముద్దుబిడ్డ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan ) ముందు వరుసలో ఉంటాడు. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ టాలెంటెడ్ హీరో, ఇటీవల విడుదలైన “లక్కీ భాస్కర్”(Lucky Baskhar ) సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి వెల్లడించాడు. ఆయనకు ఓ స్టార్ హీరోయిన్ తో నటించాలన్న కోరిక ఉంది అంటూ తన మనుసులో మాట బయట పెట్టాడు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. బాలీవుడ్ అందాల తార కాజోల్(Kajol). “నాకు కాజోల్‌తో నటించాలన్న కోరిక ఉంది. ఆమె ఏ పాత్ర చేసినా అందులో జీవం పోస్తుంది. ఆమె నవ్వు నిజంగా మనసు తాకుతుంది. ఆమె నటనలో ఉన్న ఎమోషన్ నేరుగా ప్రేక్షకుల గుండెల్లోకి చేరుతుంది. ఆమె పాత్రలు చూస్తే అవి నిజంగా జరిగాయా అనిపిస్తుంది.” అని దుల్కర్ అన్నారు.

దుల్కర్ మరోసారి ఒక తెలుగు దర్శకుడితో కలసి ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేకపోయినా, ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ రవి తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుందని, ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి “లక్కీ భాస్కర్” హిట్‌తో మళ్లీ స్పీడ్ అందుకున్న దుల్కర్, కొత్త ప్రాజెక్ట్స్‌తో పాటు వ్యక్తిగత కోరికల గురించి చేసిన వ్యాఖ్యలతో కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. త్వరలో కాజోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దుల్కర్ పొందుతాడేమో చూడాలి!

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *