Nagababu: తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాతృమూర్తి అంజనాదేవి(Anjanaadevi) ఆరోగ్యంపై మంగళవారం ఉదయం నుంచి కొన్ని రూమర్స్ సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆమె అనారోగ్యానికి గురయ్యారని, AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్యాబినెట్ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారని న్యూస్ రావడంతో మెగా ఫ్యాన్స్(Mega Fans), వారి శ్రేయోభిలాషుల్లో ఆందోళన వ్యక్తమయింది. ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు(Nagababu) తమ తల్లి ఆరోగ్యంపై స్పందించారు. ఆమె అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని నాగబాబు ఖండించారు.

నిరాధారమైన వదంతులను నమ్మవద్దు..

సోషల్ మీడియా(SM)లో అంజనాదేవి ఆరోగ్యం బాగోలేదని, ఆమె ఆసుపత్రిలో చేరారని తప్పుడు ప్రచారం చేశారు. ‘చిరంజీవి తల్లికి అస్వస్థత’, ‘చిరంజీవి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అంటూ ప్రచారం జరిగింది. దీంతో నాగబాబు స్పందించారు. “మా అమ్మ అంజనాదేవి గారి ఆరోగ్యం(Healthy) చాలా బాగుంది. ఆమె అనారోగ్యంతో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దు” అని నాగబాబు ‘X’లో పేర్కొన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్ధారించుకోకుండా వార్తలు ప్రచారం చేయవద్దని పలువురు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

అంజనా దేవికి ఐదుగురు సంతానం

కాగా కొణిదెల అంజనా దేవి (Anjana Devi)కి ఐదుగురు సంతానం. వారే చిరంజీవి (Chiranjeevi), నాగబాబు (Nagababu), పవన్ కళ్యాణ్‌ (Pavan Kalyan), విజయలక్ష్మి (Vijaya Lakshmi), మాధవి (Madhavi). కాగా, ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అమ్మ అంజనా దేవి పుట్టిన రోజును కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించారు. ఆ తర్వాత పలుమార్లు అంజనా దేవి అనారోగ్యంతో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Pawan Kalyan & Chiranjeevi, Naga Babu @His Mother Anjana Devi Birthday  Celebrations | #AcharyaTeaser - YouTube

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *