శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’(Kubera) జూన్ 20న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని ‘పిప్పీ పిప్పీ డమ్ డమ్ డమ్’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. చైతన్య పింగళి రాసిన ఈ పాటకు ప్రముఖ గాయని ఇంద్రవతి చౌహాన్ స్వరభరిత గాత్రాన్ని అందించారు. ఈ వీడియో సాంగ్‌ను ఆదిత్య మ్యూజిక్ మరియు యూట్యూబ్‌లో ప్రసారం అవుతోంది.
ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కంటెంట్ పరంగా నిండుగా ఉండే ఈ చిత్రం, థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ, టీవీ వేదికగా కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.






