ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి 4 రోజుల్లో పైచేయి సాధించింది. ఫస్ట్, సెకండ్ ఇన్నింగ్సుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269+161) పరుగులు, రవీంద్ర జడేజా (89 + 69) పరుగులు, యశస్వి జైస్వాల్ (87+27), పంత్ (25+65) పరుగులు చేయడంతో పాటు భారత జట్టు(Team India) తొలి ఇన్నింగ్స్‌లో 587, రెండో ఇన్నింగ్స్‌లో 427/6 రన్స్ వద్ద డిక్లేర్ చేసి 608 పరుగుల భారీ టార్గెట్‌ను ఇంగ్లండ్(England) ముందుంచింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌట్ అయి 180 పరుగులు వెనకబడి ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72/3తో ఉంది. దీంతో నేడు ఐదురోజు ఇరుజట్లకు కీలకం కానుంది. డ్రా కోసం ఆతిథ్య జట్టు, గెలుపు కోసం టీమ్ఇండియా ప్రయత్నించనున్నాయి.

డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువ
ఇదిలావుంటే.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు డ్రా(Draw) అయ్యే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. వర్షం ఇరు జట్లలో టెన్షన్‌ని పెంచింది. మ్యాచ్‌లో 5వ రోజు (ఆదివారం) బర్మింగ్‌హామ్‌లో భారీ వర్షం(Rain) కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఆట ప్రభావితం అయితే మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. జులై6, 7 తేదీల్లో బర్మింగ్‌హామ్(Birmingham)లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. Accuweather నివేదిక ప్రకారం.. జులై 6న ఉదయం 99% వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
🚨 🚨 #BreakingNews Edgbaston Hourly Weather Update, Day 5: Did Shubman Gill’s Declaration Come Too Late? https://t.co/lwbWzB73Ot
India vs England, Day 5 Weather Update: Rain at the venue has put India’s hopes of making history at Edgbaston under serious doubt.#TrendingNews…
— Instant News ™ (@InstaBharat) July 6, 2025
వర్షం వస్తే ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బే
దీంతో నేడు బర్మింగ్‌హామ్‌లో 2 మిమీ వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత దాదాపు 1 నుంచి 2 గంటలపాటు వర్షం కురుస్తుంది. ఆ సమయంలో 80% వరకు ఆకాశం మేఘావృతమై వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 44 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చివరి రోజు ఆటకు ఆటంకం కలగనుంది. ఒకవేళ వర్షం వస్తే ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బే అని క్రికెట్ మాజీలు అంటున్నారు. మరోవైపు గిల్ ఇండియా ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా డిక్లేర్డ్ చేశారని అంటున్నారు. కాగా గెలుపు కోసం అడుగు దూరంలో ఉన్న టీమిండియాకు వరుణుడు శాపంగా మారొద్దని ఫ్యాన్స్(Fans) ప్రార్థిస్తున్నారు.







