వరుణ్ తేజ్, గాంధీ కాంబోలో కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే..

హీరో వరుణ్ తేజ్(Varun Tej) ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 2014లో ముకుంద(Mukunda) చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, వరుసగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కంచె, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్ సినిమాలు మాత్రమే హిట్ ని అందుకున్నాయి. మట్కా ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో వరుణ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్.

ఇప్పుడు తన 15వ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి గాంధీ మేర్లపాక(Gandi Merlapaaka) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతానికి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, సినిమాలో హీరోయిన్‌గా రితిక నాయక్‌ను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ritika_nayak (@ritika_nayak__)

రితిక నాయక్(Ritika Nayak) గతంలో అశోకవనం లో అర్జున కళ్యాణం చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఆ సినిమాలో హీరోయిన్ విశ్వక్ సేన్ సోదరిగా కనిపించిన ఈ అందాల భామ తన అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాతో ఆమెకు మంచి అవకాశంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇక రితిక, తేజ సజ్జతో కలిసి నటిస్తున్న మిరాయ్ చిత్రంలో కూడా భాగమవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసే ఫోటోలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *