IIM-Calcutta: ప్రతిష్టాత్మక కోల్‌కతా ఐఐఎంలో దారుణం.. విద్యార్థినిపై అత్యాచారం

దేశంలోనే ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ (IIM-Calcutta)లో దారుణం జరిగింది. ఓ విద్యార్థినిపై అక్కడే చదువుతున్న ఓ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తాను మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి తనకు కౌన్సెలింగ్‌ ఇస్తానని చెప్పి పిలిపింపుచుకొని కూల్ డ్రింగ్లో మత్తుమందు కలిపి దారుణానికి తెగబడినట్లు బాధితురాలు వాపోయింది.

ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయి

‘కౌన్సెలింగ్ ఇస్తానని శుక్రవారం బాయ్స్‌ హాస్టల్‌కు పిలిపించుకున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూల్‌డ్రింక్‌ ఇస్తే తాగాను. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. స్పృహలోకి వచ్చిన తర్వాత నాపై అత్యాచారం జరిగినట్లు గ్రహించాను. ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా.. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు’ అని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో బాధిత యువతి పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న హరిదేవ్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కోల్‌కతాలో వరుస అత్యాచార ఘటనలు

కోల్‌కతాలో నిత్యం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ న్యాయ కళాశాలకు చెందిన విద్యార్థినిపై కాలేజీ ప్రాంగణంలోనే కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలు మరవకముందే ఐఐఎంలో విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *