‘The Girlfriend’: రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. కాపీ చేశారంటూ మొదలైన రచ్చ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీలలో కూడా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్'(‘The Girlfriend’), ఇది ఓ అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో రష్మిక సరసన టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) నటిస్తున్నాడు. కాగా, ఈ చిత్రానికి దర్శకుడిగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ వ్యవహరిస్తున్నారు. గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, తాజాగా మేకర్స్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్( First Song Released) చేశారు. ఈ పాట తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.

పాటలో రష్మిక, దీక్షిత్ ఎక్కువ డ్యాన్స్ చేయకపోయినప్పటికీ, వారి వెరైటీ పోజులు, ఎక్స్‌ప్రెషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటకు ఎమోషనల్ లిరిక్స్ తో పాటు హృద్యమైన మ్యూజిక్ కూడా తోడవడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపింది.

అయితే, ఈ వీడియో పాటపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది “ఈ పాట నీవే నుంచి కాపీలా ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే “ఇది ఢీ డ్యాన్స్ షోలో వచ్చిన పర్ఫార్మెన్స్‌లా ఉంది” అని అభిప్రాయపడుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *