విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా, గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కింగ్‌డమ్(Kingdom)’. ఈ మూవీపై అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ స్పై యాక్షన్ డ్రామా చిత్రం ట్రైలర్ విడుదల తేదీపై తాజా వార్తలు సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ‘కింగ్‌డమ్’ ట్రైలర్(Trailer) ఈ నెల జూలై 25న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse), సత్యదేవ్(Satyadev) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సత్య, విజయ్‌లపై విడుదల చేసిన అన్న అంటూనే అనే సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. కాగా ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఒక డ్యూయాలజీలో మొదటి భాగంగా రూపొందుతోంది, ఇది అభిమానులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈనెల 28న సందీప్ రెడ్డితో విజయ్ చిట్‌చాట్
ట్రైలర్ ప్రకటనతో పాటు, చిత్ర బృందం ప్రమోషన్స్(Promotions)ను మరింత ఉధృతం చేస్తోంది. జలై 28న సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో విజయ్ దేవరకొండ సరదాగా చిట్‌చాట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రోమో 14 మిలియన్లకుపైగా వీక్షణలతో యూట్యూబ్(Youtube)లో ట్రెండింగ్‌లో నిలిచింది. విజయ్ అభిమానులకు ఈ ట్రైలర్ ఒక సాలిడ్ ట్రీట్‌గా ఉండనుంది. ఈ చిత్రం ప్యాన్-ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో, హిందీలో ‘సామ్రాజ్యం(Samrajyam)’ టైటిల్‌తో విడుదల కానుంది. ఈ ట్రైలర్‌తో ‘కింగ్‌డమ్’ హైప్ మరింత పెరిగి, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది.
#Kingdom Promotions Begin !🔥#VijayDeverakonda#KingdomOnJuly31st pic.twitter.com/5IAG25RXRM
— Karthikeya 🙂 (@NaPeruKarthik_) July 20, 2025






