Pawan Kalyan: పూరి జగన్నాధ్ తో పవర్ కళ్యాణ్ భారీ ప్రాజెక్ట్..? ఈసారి హీరోనా? నిర్మాతనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jadannadh) కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా బద్రి(Bhadri) (2000) బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఆ తర్వాత 2012లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబుపై అప్పట్లో రాజకీయంగా విమర్శలు వచ్చినా.. మాస్ యూడియన్స్‌కు ఈ సినిమా కనెక్ట్ అయింది.

ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబో రీప్రీట్ కాబోతుందనే వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. పవన్ అభిమానులు అయితే ఈ జోడీ నుంచి మరో సాలిడ్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ తన రాజకీయ జీవితం, సినిమాల మధ్య సమతౌల్యం పాటిస్తూ, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇటీవల హరిహర వీరమల్లు విడుదల కాగా, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్‌ పూర్తయ్యాయి.

తాజా ఇంటర్వ్యూలో పవన్, “కొంత గ్యాప్ తీసుకుంటున్నాను, అవసరమైతే సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తాను” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆయన హీరో( Actor)గా నటిస్తారా? లేక నిర్మాత(Producer)గా వ్యవహరిస్తారా? అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉండగా, పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత పవన్‌తో ఓ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్.

మొత్తానికి ఈ జోడీ మళ్లీ కలిస్తే అది టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. గతంలో వచ్చిన రెండు సినిమాలు ఇప్పటికీ రీ-వాచ్ వాల్యూతో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. అందుకే పవన్-పూరి కాంబో మళ్లీ వెండితెరపై కనిపిస్తే, బాక్సాఫీస్‌లో హంగామా ఖాయమని అంటున్నారు. కానీ అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *