Ajinkya Rahane: టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్‌బై

టీమ్ఇండియా(Team India) సీనియర్ బ్యాటర్, ముంబై క్రికెట్ దిగ్గజం అజింక్యా రహానే(Ajinkya Rahane) 2025-26 దేశవాళీ సీజన్ ముందు ముంబై జట్టు కెప్టెన్సీ(Captaincy of the Mumbai team) నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ఆయన (ఆగస్టు 21) సోషల్ మీడియా(SM) వేదికగా వెల్లడించాడు. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొత్త నాయకుడిని తయారుచేసేందుకు ఇదే సరైన సమయమని రహానే తెలిపాడు. అయినప్పటికీ, ఆటగాడిగా ముంబై తరపున తన సేవలను కొనసాగిస్తానని, మరిన్ని ట్రోఫీలు సాధించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశాడు. రహానే సారథ్యంలో ముంబై జట్టు అనేక విజయాలు సాధించింది.

అజింక్యా రహానే గుడ్ బై? | Ajinkya Rahane Steps Down as Mumbai Captain –  Focus Shifts to Batting - Telugu MyKhel

201 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 14,000 పైగా పరుగులు

2023-24 సీజన్‌లో ఏడేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ(Ranji Trophy)ని గెలుచుకుంది. అలాగే, 2022-23లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy), 2024-25లో ఇరానీ కప్‌(Irani Cup)ను కైవసం చేసుకుంది. 18 సంవత్సరాల దేశవాళీ కెరీర్‌లో 186 మ్యాచ్‌లు ఆడిన రహానే, 201 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 14,000 పైగా పరుగులు సాధించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ, క్రికెట్‌కి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని, బ్యాటర్‌గా తన ఆటతీరుతో జట్టుకు సహకరిస్తానని పేర్కొన్నాడు. కాగా ముంబై జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar), సూర్యకుమార్ యాదవ్ లేదా యశస్వీ జైస్వాల్‌లలో ఒకరు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *