Coolie: కలెక్షన్ల సునామీ.. రికార్డులు తిరగరాస్తున్న రజినీ ‘కూలీ’!

రజినీకాంత్(Rajinikanth) కథానాయకుడిగా రూపొందిన ‘కూలీ(Coolie)’ ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పటికి చాలా రోజుల ముందు నుంచి కూడా థియేటర్ల దగ్గర సందడి తగ్గింది. అలాంటి సమయంలో ఈ సినిమా మళ్లీ ఒక్కసారిగా థియేటర్లను నింపింది. అన్ని ప్రాంతాలలోని థియేటర్లు కళకళలాడాయి. తొలి రోజు నుంచే ఈ సినిమా తన రికార్డుల వేట మొదలుపెట్టింది.

తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు

తొలి వారంలో ఈ సినిమా రూ.444 కోట్లను కొల్లగొట్టింది. ఇప్పటివరకూ ఉన్న రికార్డులను ఈ సినిమా తుడిచిపెట్టేసింది. ఈ సినిమా రూ.460 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తే మరి కొన్ని రికార్డులు పక్కకి తప్పుకుంటాయని చెబుతున్నారు. త్వరలోనే రూ.500 కోట్ల మార్కును అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. తొలి మూడు రోజులలోనే ఈ సినిమా భారీ వసూళ్ల(Collections)ను రాబట్టింది. అదే ఊపు కొనసాగి ఉంటే, ఈ పాటికే ఆ మార్క్ ను అందుకుని ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రజినీ టాప్-5 సినిమాల జాబితాలో.. 

తమిళనాట అతధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల జాబితాలో రజినీకాంత్ నటించిన ‘Robo-2.0’ .. ‘జైలర్(Jailer)’ ఉన్నాయి. ప్రస్తుతానికి ‘కూలీ’ టాప్ 6 ప్లేస్ కి వచ్చి చేరింది. త్వరలోనే టాప్-5లో జాయిన్ కావొచ్చని అంటున్నారు. రజినీ ఫ్యాన్స్ ఒక వైపున కూలీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే, మరో వైపున ‘జైలర్ 2’ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మరో వైపున రజినీ-కమల్ కలిసి సినిమా చేయవచ్చనే ప్రచారం కూడా కోలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *