Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ చేపడతారు. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath) మృతి పట్ల సభ సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మండలిలోనూ ఇటీవల మృతిచెందిన మాజీ MLCలు డాక్టర్‌ T.రత్నాకర్‌, M. రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానం(Condolence Resolution) ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానం తర్వాత సభను వాయిదా వేయనున్నట్టు సమాచారం.

Kaleshwaram project: ప్రభుత్వానికి సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై చర్చ

వాయిదా అనంతరం అసెంబ్లీ స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌ ఆధ్వర్యంలో BAC సమావేశం నిర్వహించి ఇటు అసెంబ్లీలో, అటు కౌన్సిల్‌(Council)లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) సమర్పించిన నివేదికను సభలో ప్రవేశపెడతారు. ఈ నివేదిక 600 పేజీలకు పైగా ఉంది, దీనిపై సవివరమైన చర్చ జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం సభలో హీటెక్కించే అవకాశం ఉందని, అధికార, విపక్షాల మధ్య హాట్ హాట్‌గా చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ

ఇక ఇవాళ సీఎం రేవంత్(CM Revanth) ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. శాసన మండలి కూడా ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఎమ్మెల్సీలకు కాళేశ్వరం నివేదిక ప్రతులు అందజేయనున్నారు. డిప్యూటీ స్పీకర్(Deputy Speaker) ఎన్నిక కూడా ఈ సెషన్‌లో జరిగే అవకాశం ఉంది. సమావేశాల నిర్వహణపై శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)లో చర్చ జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు (Local body elections), బీసీ రిజర్వేషన్లు(BC Reservations), మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై విజిలెన్స్, NDSA నివేదికలు కూడా చర్చకు రానున్నాయి. సమావేశాలు సజావుగా సాగేలా అధికారులకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *