మర అదృష్టవంతులు

  • మద్యం టెండర్లు అంటే ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో అందుకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ప్రభుత్వానికి భారీ ఆదాయం. ఇటు టెండర్లు పాడుకున్నాక సంపాదించుకున్న వాళ్లకు కూడా ఊహించని కలెక్షన్లు. అందుకు తగ్గట్టుగానే భారీగా టెండర్లు వచ్చాయి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తెలంగాణలో మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించి అధికారులు నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. 2023-25కు గానూ మొత్తం 2,620 మద్యం దుకాణాల కేటాయింపుల కోసం డ్రా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తుదారుల సమక్షంలో ఉదయం 10.30 గంటలకు దుకాణాల వారీగా డ్రా తీయనున్నారు. డ్రాలో గెలుపొందిన వారు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్ రుసుములో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగించేందుకు అనుమతించనున్నారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్‌ షెడ్యూల్‌ వస్తే మద్యం దుకాణాలకు టెండర్లు వేసే అవకాశం ఉండకపోవడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మద్యం దుకాణాలకు వేలం వేసింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా వీటి కోసం ఏకంగా 1,31,490 దరఖాస్తులు వచ్చాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *