TS Elections: ప్రజల కోసం కాదు..ఓట్ల కోసమే కేసీఆర్‌ తాంత్రిక పూజలు-బండి సంజయ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత బండి సంజయ్‌ విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌ కుమ్మక్కైందని బండి సంజయ్‌ పదేపదే వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే ఎంపీ బండి సంజయ్‌ తనదైన శైలిలో కేసీఆర్‌ సర్కార్‌పై మండిపడ్డారు. కేసీఆర్‌కు జనం మీద గానీ వారి ఓట్ల మీద నమ్మకం లేదని అన్నారు. కేవలం జనాలను వశీకరణ చేసుకోవడంపై దృష్టిపెట్టారని, అంతేకాకుండా నిమ్మకాయలతో తాంత్రిక పూజలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చేసే పూజలు జనాల హితం కోసం చేస్తే అవి ఫలిస్తాయని, మరొకరిని నాశనం చేయడం కోసం చేస్తే ఫలించవంటూ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం మొత్తం తిరిగి కాళేశ్వరం గురించి గొప్పలు

ప్రాజెక్టుల మోటార్లు మునిగిపోతే సీఎం కేసీఆర్‌ ఏమీ మాట్లాడలేదని, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోటే స్పందించలేదని, అన్నారం లీక్ అవుతుంటే పట్టించుకోలేదని.. కానీ టెండర్ల సమయంలో మాత్రమే కేసీఆర్‌ బయటికి వచ్చి మాట్లాడతారని సంజయ్‌ అన్నారు. దేశం మొత్తం తిరిగి కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్నారు, నదులకు నడకలు నేర్పిన నేత అని గొప్పలుకొట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదని చెప్పారు. అంతేకాకుండా నదిలో ఇసుక ద్వారా వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, ప్రాజెక్ట్‌లకు లీకేజీలు, పగుళ్ల విషయంలో కనీసం సీఎం స్పందించకపోవడం దారుణమని అన్నారు. అసెంబ్లీలో టోపీ పెట్టుకుని, కర్ర పట్టుకుని ప్రొజెక్టర్ చూపిస్తూ చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని బండి ప్రశ్నించారు.

కట్టిన ప్రాజెక్టులు, వంతెనలన్నీ పడిపోతున్నాయి

కాంట్రాక్టులు, కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ కొంచెం కూడా ప్రాజెక్టుల నాణ్యత మీద లేదని, తాంత్రిక పూజల ద్రవ్యాలు కలపడం కోసమో, కాంట్రాక్టర్ నుంచి కమీషన్ల కోసమో ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తారు తప్ప నాణ్యత పరిశీలించడం కోసం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చాలా మంది ఇంజినీర్లు ఉన్నారని, కానీ వారి మాటను కేసీఆర్‌ వినడం లేదని, ఆయనే ఒక చీఫ్‌ ఇంజినీర్‌లా వ్యవహరిస్తున్నారని సంజయ్‌ అన్నారు. రైతులకు ఎంతో అన్యాయం చేశారని, వారికి క్షమాపణలు చెప్పిన తర్వాతే బీఆర్‌ఎస్‌ నేతలు ఓట్లు అడగాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టిన వంతెనలన్నీ పడిపోతున్నాయని, ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని, డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు కూడా ఇలాగే ఉన్నాయేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు. జరిగిన నష్టాన్ని మొత్తం సీఎం కుటుంబం నుంచే రికవరీ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

 

 

Related Posts

Rammohan Naidu: స్టేజీపై డ్యాన్స్‌తో ఇరగదీసిన కేంద్రమంత్రి.. వీడియో చూశారా?

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu) తన బాబాయి ప్రభాకర్ రావు కుమారుడి సంగీత్‌లో డ్యాన్స్‌(Dance) చేసితో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో ఆయన తన చలాకీతనాన్ని చాటుకున్నారు. హుషారైన…

Chidambaram: ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ నేత చిదంబరం సెన్సేషనల్ కామెంట్స్

పార్లమెంట్ వర్షాకాల సమావేశా(Parliament monsoon sessions)ల్లో భాగంగా నేడు (జులై 28) లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)పై చర్చ జరగనుంది. ఈ మేరకు అన్ని పార్టీలు విప్ జారీ చేయగా దేశ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *