Pancard: 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివ్‌ అయ్యాయి.. ఇందులో మీ కార్డ్ ఉందా ఇలా చెక్‌ చేసుకోండి.

మన ఈనాడు:ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివేట్‌ అయ్యాయి. ఆధార్‌తో లింక్‌ చేయని కారణంగా ఈ పాన్‌ కార్డులను డీ యాక్టివేట్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్ టాక్సెస్‌ తెలిపింది. దేశంలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులు ఉండగా. వీటిలో.. 57.25 కోట్ల పాన్ కార్డులు గడువు లోపు ఆధార్ కార్డుతో లింక్‌ అయ్యాయి. అలాగే 13 కోట్ల పాన్‌ కార్డులు ఆధార్‌తో లింక్‌ కాలేవు. అయితే కొందరికీ దీని నుంచి మినహాయింపు వచ్చింది.

ఆధార్‌ కార్డును, పాన్‌ కార్డ్‌తో అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుసార్లు కేంద్రం గడువును పొడగిస్తూ వచ్చింది. తొలుత ఉచితంగా లింక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఆ గడువు ముగిసిన తర్వాత ఫైన్‌ చెల్లించి ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డ్ లింక్‌ చేసుకునే సౌలభ్యం కల్పించారు. అయితే ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసింది. దీంతో ఆధార్‌తో లింక్‌ కానీ పాన్‌ కార్డులు నిరుపయోగంగా మారాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివేట్‌ అయ్యాయి. ఆధార్‌తో లింక్‌ చేయని కారణంగా ఈ పాన్‌ కార్డులను డీ యాక్టివేట్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్ టాక్సెస్‌ తెలిపింది. దేశంలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులు ఉండగా. వీటిలో.. 57.25 కోట్ల పాన్ కార్డులు గడువు లోపు ఆధార్ కార్డుతో లింక్‌ అయ్యాయి. అలాగే 13 కోట్ల పాన్‌ కార్డులు ఆధార్‌తో లింక్‌ కాలేవు. అయితే కొందరికీ దీని నుంచి మినహాయింపు ఇవ్వగా ప్రస్తుతం సుమారు 11.5 కోట్ల పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేశారు.

కొంత మంది ఆధార్‌, పాన్‌ను లింక్‌ చేశామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇలాంటి వారు తమ పాన్‌ కార్డ్‌ యాక్టివ్‌లో ఉందో లేదో తెలుసుకునే అవకాశం కల్పించారు అధికారులు. ఇంతకీ మీ పాన్‌ కార్డ్‌ యాక్టివ్‌లో ఉందో, లేదో తెలుసుకునేందుకు కొన్ని స్టెప్స్‌ ఫాలో అయితే చాలు. ఇందుకోసం ఇన్‌కమ్‌ టాక్స్‌ ఈ ఫైలింగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది.

ముందుగా ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ అధికారిక వెబ్ సైట్(https://www.incometax.gov.in/iec/foportal/)కి వెళ్లాలి. అనంతరం హోం పేజీలో లెఫ్ట్‌ సైడ్‌లో లింక్‌ ఆధార్‌ స్టటస్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అనంతరం ఆ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. తర్వాత మీ పాన్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌లను ఎంటర్ చేయాలి. తర్వాత వ్యూ లింక్‌ ఆధార్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీ పాన్‌, ఆధార్‌ కార్డ్‌ లింక్‌ అయ్యిందో లేదో డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ లింక్‌ కాకపోతే మీ పాన్‌ డీ యాక్టివేట్ అయ్యిందని అర్థం.

  • Related Posts

    Trade War: తగ్గేదేలే.. US ఉత్పత్తులపై 84% సుంకం విధించిన చైనా

    యునైటెడ్ స్టేట్స్‌(USA)తో వాణిజ్య పోరులో చైనా(Chaina) మరింత దూకుడుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 34% మేరగా ఉన్న అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌(Tariffs)ను చైనా ఒక్కసారిగా 84% పెంచింది. పైగా ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇది డొనాల్డ్ ట్రంప్(Donald…

    ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్‌ బర్గ్‌ జోరు

    Mana Enadu : ప్రపంచ కుబేరుల జాబితా (Worlds Richest People List)లో మరోసారి టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్ (Elon Musk) 256 బిలియన్‌ డాలర్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఈసారి జాబితాలో మెటా (Meta) సీఈవో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *