యునైటెడ్ స్టేట్స్(USA)తో వాణిజ్య పోరులో చైనా(Chaina) మరింత దూకుడుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 34% మేరగా ఉన్న అమెరికా ఉత్పత్తులపై టారిఫ్(Tariffs)ను చైనా ఒక్కసారిగా 84% పెంచింది. పైగా ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇది డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సర్కారు ప్రకటించిన 104 శాతం దిగుమతి సుంకానికి సమాధానంగా తీసుకున్న చర్య. ఈ వాణిజ్య యుద్ధం(Trade War) గమనించిన వారు ఊహించిన దాని కంటే వేగంగా, తీవ్రమైన స్థాయికి చేరుకుందని చెప్పాలి. టారిఫ్ పెంపుతో పాటు, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..
ఆ కంపెనీల పెట్టుబడులపై నిషేధం
అమెరికా(USA)కు చెందిన 12 కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలోకి చేర్చగా, మరో 6 సంస్థలను ‘నమ్మలేని యూనిట్లు’గా గుర్తించింది. వీటిపై చైనా లోపల ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు నిషేధించబడినట్టు ప్రకటించింది. ఇందులో అమెరికన్ ఫోటోనిక్స్(American Photonics), నోవోటెక్ వంటి సంస్థలు ఉన్నాయి. షీల్డ్ AI, సియెరా నెవాడా కార్పొరేషన్ వంటి కంపెనీలపై పెట్టుబడులపై నిషేధం కూడా అమల్లోకి వస్తోంది.
వినియోగదారులపై ప్రభావం
అమెరికా ఎప్పటినుంచో చైనాతో భారీ వాణిజ్య లోటు(Trade deficit)ను ఎదుర్కొంటోంది. US ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024లో చైనా నుంచి దిగుమతులు 440B డాలర్లకు చేరగా, US నుంచి చైనాకు వెళ్లిన ఎగుమతులు కేవలం 14B డాలర్లకే పరిమితమయ్యాయి. ఈ అసమతుల్యత ఆధారంగా ట్రంప్ ప్రభుత్వం ఈ విధంగా భారీ టారిఫ్‌లకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మొత్తానికీ ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు ఆర్థిక శక్తుల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం, సాధారణ వినియోగదారులపై కూడా ప్రభావం చూపనుంది.
China Hits Back with Massive Tariff Hike
🇨🇳 Raises tariffs on U.S. imports to 84% (up from 34%) starting April 10, 2025, 12:01 PM Beijing time—a direct retaliation after U.S. upped tariffs to same rate.
Trade War 2.0 or, Negotiations?#crypto #bitcoin #altcoin #America #chaina pic.twitter.com/GICn3SwrTa
— XyrothNight (stand with Philistine 🇵🇸) (@XyrothNight) April 9, 2025






