– 55ఏళ్ల అధికారం ఇస్తే..అంధకారంలోకి నెట్టారు
-మూడు ఏళ్లలో 35పైఒవర్‌లు నిర్మించాం
ఉప్పల్ నలుములలా మెట్రో తెస్తాం
మల్లాపూర్ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ బాగుండాలంటే అల్లటప్పా నాయకులు కాదు..బలమైన నాయకత్వంతోపాటు..స్థిరమైన ప్రభుత్వం అవసరమని అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్,పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్,ఈసీఐఎల్ ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్‌షో జోరు వర్షంలోనే కొనసాగింది. ఒకవైపు వర్షం కురుస్తున్నా ప్రజలు ఒపికతో కారు గుర్తును గెలిపించేందుకు ప్రచార సభకు హజరైనవారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే సీఎం కేసీఆర్‌కు నేరుగా మీ ఓటు పడినట్లేనని పేర్కొన్నారు. మరో టర్మ్ అధికారంలోకి రాగానే ఉప్పల్ నియోజకవర్గంలో రూ.20వేల కోట్ల నిధులతో వరదనీటి కాల్వల నిర్మాణం చేపట్టి వరదల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టమైన హమీనిచ్చారు.
* కాంగ్రెస్ అధికారంలో పరిశ్రమలకు పవర్ హలిడేః
ఒక్కసారి అవకాశం ఇవ్వండని ప్రజలను అడుగుతున్న కాంగ్రెస్‌కు 11సార్లు 55ఏళ్ల అధికారం ఇస్తే రాష్ర్టంతోపాటు దేశాన్ని అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. అంతేగాకుండా ఉప్పల్,చర్లపల్లి, మల్లాపూర్ పారిశ్రామికవాడల్లో పరిశ్రమలకు పవర్ హలిడే ప్రకటిస్తే వారంలో మూడు రోజులే కంపెనీలు నడిచాయన్నారు. దీంతో కార్మికులు పనులు లేక ఆకలితో అల్లాడిపోయ్యారని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా జనరేటర్లు, ఇన్వర్టర్లే కనిపించే పరిస్థితి అప్పట్లో ఉందన్నారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక కరెంట్ కోతలు మాటలే వినపడటం లేవన్నారు.
* 3ఏళ్లలో 35 వంతెనలు నిర్మించాంః
మూడు సంవత్సరాలలో హైదరాబాద్‌లో 35వంతెనలు నిర్మాణం చేసి ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా వరంగల్ జాతీయ రహాదారి కావడంతో ఉప్పల్ ప్లైఒవన్ నిర్మాణం చేపడతామని లక్కొన్నారన్నారు. కానీ అడుగు కూడా ముందుకు పడటం లేదని ఆరోపించారు. సిగ్గులేని బీజేపి మళ్లీ ఉప్పల్లో ఓట్లు కోసం తిరగడం సిగ్గుచేట్టన్నారు. ఉప్పల్-మల్లాపూర్-ఈసీఐఎల్ వరకు మళ్లీ అధికారంలోకి రాగానే తొలి మూడేళ్లలో మెట్రో నిర్మాణం పూర్తి చేస్తామని అక్కడి ప్రజలకు హమీనిచ్చారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎన్నికల బాధ్యడు రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, శాంతిసాయిజెన్ శేఖర్, జెర్రిపోతుల ప్రభుదాస్ పాల్గొన్నారు.
Rammohan Naidu: స్టేజీపై డ్యాన్స్‌తో ఇరగదీసిన కేంద్రమంత్రి.. వీడియో చూశారా?
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu) తన బాబాయి ప్రభాకర్ రావు కుమారుడి సంగీత్‌లో డ్యాన్స్(Dance) చేసితో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో ఆయన తన చలాకీతనాన్ని చాటుకున్నారు. హుషారైన…
Chidambaram: ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ నేత చిదంబరం సెన్సేషనల్ కామెంట్స్
పార్లమెంట్ వర్షాకాల సమావేశా(Parliament monsoon sessions)ల్లో భాగంగా నేడు (జులై 28) లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై చర్చ జరగనుంది. ఈ మేరకు అన్ని పార్టీలు విప్ జారీ చేయగా దేశ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.…