KTR: కొత్త రేషన్ కార్డులపై KTR సంచలన ప్రకటన!

మన ఈనాడు: మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం.. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Telangana Elections 2023: తెలంగాణలో ప్రచారం చేసుకునేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అనేక రకాలుగా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను (BRS Manifesto) ప్రజలకు అర్ధం అయ్యే విధంగా ప్రచారం చేస్తున్నారు.
2014లో రూ.400 ఉన్న సిలిండర్‌ మోదీ (Modi) హయాంలో ప్రస్తుతం రూ.1200 అయ్యిందని అన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో కరెంట్ కష్టాలు ఉండేవని తెలిపారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వ్యాఖ్యానించారు.

మంత్రి కేటీఆర్ రేషన్ కార్డులపై (Ration Cards) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనవరి నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని వెల్లడించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *