Ronald Ross : HYDలో 312మంది బరిలో..5గంటల తర్వాత..

మన ఈనాడు:హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. 312మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులు రేపు (నవంబర్ 28) సాయంత్రం 5గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఆ తర్వాత ప్రచారం బంద్ అవుతుందన్నారు. అన్ని అడ్వర్టైజ్ మెంట్స్ తొలగిస్తామన్నారు.

పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 125శాతం ఈవీఎంలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 29వ తేదీ నుండి ఈవీఎంలు పంపిణీ చేస్తామన్నారు.
4వేల 119 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. 369 సెక్టార్స్, రూట్స్ ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. పోలింగ్ కోసం 20వేల మంది సిబ్బందిని ఉపయోగించుకుంటున్నాము అని రొనాల్డ్ రాస్ చెప్పారు. 20వేల డూప్లికేట్లు తొలగించామని వివరించారు. హోమ్ ఓటింగ్ కోసం 835మంది అప్లయ్ చేసుకోగా 733మంది హోం ఓటింగ్ ద్వారా ఓటు వేశారని వెల్లడించారు.
పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 1,678 లొకేషన్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.79.07 కోట్లు సీజ్ చేశామన్నారు. అందులో రూ.42.25 కోట్లు క్యాష్ ఉందన్నారు. 3.5కోట్ల విలువైన లిక్కర్ సీజ్ చేశామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 45లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 8లక్షల మంది యూత్ ఓటర్లు ఉన్నారని తెలిపారు.
సి.విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 1,136. దానిపై 250 టీమ్స్ ఫీల్డ్ మీద తిరుగుతున్నాయన్నారు. ఓటింగ్ కేంద్రం వద్ద రద్దీ ఎలా ఉంది? అని తెలుకోవడానికి క్యు అనే ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని, దాని ద్వారా ఓటు వెయ్యడానికి ఎప్పుడు వెళ్లాలి? అని ఓటర్లు ప్లాన్ చేసుకోవచ్చన్నారు.

Share post:

లేటెస్ట్