బిగ్ బాస్ షోకి కుమారి ఆంటీ… స్వయంగా క్లారిటీ ఇచ్చిన సోషల్ మీడియా సెన్సేషన్

మన ఈనాడు:కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆమె కోసం ఏకంగా తెలంగాణ సీఎం స్పందించడంతో మరింత పాప్యులర్ అయ్యారు. కుమారి ఆంటీ బిగ్ బాస్ షోకి వెళతారని ప్రచారం అవుతుండగా, ఆమె స్వయంగా స్పందించారు.

స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ అనూహ్యంగా ఫేమ్ తెచ్చుకున్నారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో కుమారి ఆంటీ కొన్నాళ్లుగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తక్కువ ధరకు భోజనం అందిస్తుంది. పలువురు యూట్యూబర్స్ ఆమెను ఇంటర్వ్యూ చేయడం, రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.

కుమారి ఆంటీ సోషల్ మీడియా స్టార్ అయ్యారు. కుమారి ఆంటీని చూసేందుకు, ఆమె చేతి వంటకాలు రుచి చూసేందుకు పదుల సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె బిజినెస్ క్లోజ్ చేయించారు.

కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో ఆమె బిగ్ బాస్ షోకి వెళతారని ప్రచారం జరుగుతుంది. దీనిపై కుమారి ఆంటీ స్వయంగా స్పందించారు. మీరు బిగ్ బాస్ షోకి వెళుతున్నారటగా? అని అడగ్గా… బిగ్ బాస్ షోనా? అక్కడికి వెళ్లి వంట చేయాలా? అని అన్నారు.

కుమారి ఆంటీ కామెంట్స్ పరిశీలిస్తే ఆమెకు బిగ్ బాస్ షో పట్ల అవగాహన లేదు. అలాగే కుమారి ఆంటీకి ఎలాంటి బిగ్ బాస్ ఆఫర్ రాలేదని తెలుస్తుంది. లక్షల్లో ఆమెకు బిజినెస్ జరుగుతుండగా ఒకవేళ ఆఫర్ వస్తే వదిలేసి వెళతారా? అనే చర్చ నడుస్తోంది.

స్టార్స్ కూడా కుమారి ఆంటీ కస్టమర్స్ అట. ఎన్టీఆర్, ఆలీ తన వద్ద కర్రీలు తెప్పించుకునేవారట. ఇటీవల సందీప్ కిషన్ స్వయంగా వెళ్లి కుమారి ఆంటీ స్టాల్ వద్ద భోజనం చేశాడు. అందుకు గానూ రూ. 10 వేలు కుమారి ఆంటీకి ఇచ్చినట్లు సమాచారం.

Related Posts

Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా(Bucchibabu Sana) కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’. ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.…

Kishkindhapuri: బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’ మూవీ రిలీజ్ తేదీ ఎప్పుడంటే?

‘భైరవం(Bhairavam)’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) తర్వలో ‘కిష్కింధపురి(Kishkindhapuri)’ చిత్రంతో రాబోతున్నాడు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్ళపాటి(Kaushik…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *