అనసూయ జబర్దస్త్ వదలడానికి కారణం అతడేనట.. అసలు విషయం చెప్పేసిన పైహర్ ఆది

మన ఈనాడు:యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ తన అందం, అభినయంలో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షోలో దాదాపు పదేళ్ల పాటు పని చేసి బుల్లితెర ప్రేక్షకుల అందరి మదిలో ప్రత్యేక స్థానాన్నిసంపాధించుకుంది. అన్నేళ్ల పాటు ఒకేచోట యాంకర్ గా పని చేస్తూ.. కడుపుబ్బా నవ్వించిన ఈ హాట్ బ్యూటీ ఆ షోనుంచి వీడిపోవడానికి కారణం జబర్దస్త్ కమెడియన్ అంట. అయితే అతను ఎవరో, ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

జోర్దాస్త్ సుజాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలువురు బుల్లితెర సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే గెటప్ శ్రీను ఈమె షోకు రాగా అనేక ఆసక్తికర విషయాలను రాబట్టింది. తాజాగా హైపర్ ఆదిని ఇంటర్వ్యూ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుజాత అడిగిన ప్రశ్నలు, అందుకు హైపర్ ఆది చెప్పిన సమాధానాలను అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

చిన్నప్పటి నుంచే మీరు ఇలా పంచులు వేస్తూ ఉండేవాళ్లా.. లేక ఇప్పుడే నేర్చుకున్నారా అని సుజాత అడగ్గా.. ఆది ఫుల్ గా నవ్వాడు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చే ఆడాళ్లందరి తోని మీరు ఫుల్ ఫ్లేవర్ తో పులిహోర కలుపుతారని టాక్ అని అనగా మళ్లీ నవ్వేశాడు. మీకు ఓ లవ్ స్టోరీ ఉండే బ్రేకప్ అయింది కదా అనగానే… అందరితో విచ్చలవిడిగా మాట్లాడే నేను ఆరోజు ఆ అమ్మాయితో మాట్లాడలేకపోయానంటూ చెప్పుకొచ్చాడు. అమ్మాయిలు, ఆంటీల మీద ఎప్పుడూ బాడీ షేమింగ్ పంచులు వేస్తుంటారు ఎందుకు అనగా.. నెగిటివ్ కామెంట్లు చేస్తేనే వైరల్ అవుతాం… ఈ స్థాయికి వస్తామంటూ వివరించాడు.

 

Share post:

లేటెస్ట్