Kavya Thapar: రొమాన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.. రవితేజతో కెమిస్ట్రీ అలా: ఈగల్ హీరోయిన్ కావ్య థాపర్

మన ఈనాడు: Kavya Thapar About Eagle Movie: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టైలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. తప్పకుండా సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే రవితేజ గారి సినిమాలో చేయడం గొప్ప అవకాశం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంపిక చేశారు. ఈగల్‌లో యాక్షన్ రోమాన్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి.

ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తాను. ఇందులో చాలా అద్భుతమైన ప్రేమకథ ఉంది. దాని గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు (నవ్వుతూ). రవితేజ గారు, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్‌గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈగల్‌పై రవితేజ గారు, డైరెక్టర్ కార్తిక్, మా టీం అంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాం.

రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. రవితేజ గారి వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. సెట్స్‌లో చాలా సరదాగా, సపోర్టివ్‌గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈగల్ బ్యూటీఫుల్ జర్నీ. పోలాండ్, లండన్ ఇలా అద్భుతమైన ఫారిన్ లోకేషన్స్‌లో ఇంటర్ నేషనల్ లెవల్‌లో షూట్ చేశారు.

రచయిత మణిగారు ”అద్భుతంగా నటించారు. తెరపై కావ్య కాకుండా రచన కనిపించింది’ అన్నారు. రచయిత నుంచి ఈ ప్రశంస రావడం చాలా తృప్తిని ఇచ్చింది. నా వరకూ పాత్రకు వందశాతం న్యాయం చేశాననే నమ్ముతున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వవర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాని ఇంటర్నేషనల్‌గా చాలా గ్రాండ్‌గా చిత్రీకరించారు. వారితో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను.

 

Related Posts

Allu Aravind: బ్యాంక్ రుణ మోసం కేసు.. అల్లు అరవింద్‌ను విచారించిన ఈడీ

తెలుగు సినీ పరిశ్రమలో ఈడీ(Enforcement Directorate) కలకలం రేపింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌(Allu Aravind)ను ED అధికారులు విచారించారు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ(Ramakrishna Electronics Company)కు సంబంధించిన రూ.101 కోట్ల బ్యాంక్ రుణ…

Hari Hara Veera Mallu: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న HHVM ట్రైలర్.. 24 గంటల్లో 45 మిలియన్ల వ్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ ట్రైలర్(Trailer) సినీ ప్రియులను, అభిమానులను ఉర్రూతలూగించింది. నిన్న (జులై 3) విడుదలైన ఈ ట్రైలర్ 24 గంటల వ్యవధిలో యూట్యూబ్‌(You…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *