Kavitha Remand|కవిత రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

ManaEnadu: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శనివారం రిమాండ్ విధించింది.

అలాగే ఈడీ కస్టడీకి సైతం అనుమతించింది. అయితే రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు. ‘ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవ, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు.

ఆప్ నేతలతో కుమ్మక్కై రూ. 100 కోట్లు ముడుపులు ఇచ్చారు. లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు. రామచంద్ర పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీతో కవిత వాటా పొందారు.

కవితకు రామచంద్ర పిళ్లై బినామీగా ఉన్నారు. రామచంద్ర పిళ్లై ద్వారా కవిత వ్యవహారం నడిపించింది. ఎంపీ మాగుంట ద్వారా రూ. 30 కోట్లు ఢిల్లీకి కవిత చేర్చింది. ఈ రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్‌పల్లి ఢిల్లీకి తీసుకెళ్లారు. స్టేట్ మెంట్ రికార్డు చేసే సమయంలో కవిత అసంబద్ధ సమాధానాలు చెప్పారు. సాక్ష్యాలను ధ్వసం చేశారు.’ అని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *