మోగిన నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ManaEnadu:లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

దేశ పౌరులు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 2024లో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాదిని ఎన్నికల నామసంవత్సరంగా చెప్పుకోవచ్చని తెలిపారు.

స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నెలకొన్న భారత్ లో ఎన్నికల సరళి ఎలా ఉందన్న విషయాన్ని ప్రపంచం గమనిస్తోందని రాజీవ్ కుమార్ చెప్పారు. 2024 జూన్ 16న 17వ లోక్‌సభ కాలం ముగియనుందని తెలిపారు. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ వివరించారు. దేశంలో ఎన్నికలకు సంబంధించి.. మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.5 కోట్ల పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది, 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు ఉన్నాయని చెప్పారు.

దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని రాజీవ్ కుమార్ తెలిపారు.

Share post:

లేటెస్ట్