దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్‌తోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన సైతం వెలువడింది.. ఎన్నికల సంఘం గణంకాల మేరకు ఇప్పటి వరకు కొత్త కోటి 98 లక్షల ఓటర్లు వచ్చారు.
త్వరలో దేశవ్యాప్తంగా లోక్ సభ మరియు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కొత్త కోటి 98 లక్షల ఓటర్లు వచ్చారట. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు మే 13 వ తారీఖున జరగబోతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు కావాల్సినంత సమయం దొరకడం తో సరైన ప్రణాళికలతో, సంపూర్ణమైన మానిఫెస్టోలతో జనాల్లోకి దూసుకెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే మీకు ఉన్న ఓటర్ ఐడీ(VOTER ID) లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ని కల్పించింది ఎన్నికల సంఘం.
ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ ఫామ్ 8 నింపి ఓటర్ ఐడీ లో మార్పులు చేసుకోవచ్చు. ఈ ఫామ్ లో ఓటరు పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, వయస్సు, లింగం కి సంబంధించిన క్యాటగిరీలు ఉంటాయి. వాటిలో ఏవైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ లో సంబంధిత ధ్రువ పత్రాలు అప్లోడ్ చెయ్యడం తప్పనిసరి. ఆ తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, దానిని ఉపయోగించి మీ అప్లికేషన్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. మొబైల్ నుండే voterportal.eci.gov.in form లో ఈ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చు.