బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నిక బరిలో ఉంటానని, ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలు సహకరించాలని దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి, భారాస నాయకురాలు నివేదిత కోరారు.
తన సోదరి లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అనంతరం ఆమె తొలిసారిగా శనివారం కాకాగూడ గృహలక్ష్మి కాలనీలోని నివాసంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ.. లాస్యనందిత ఆశయసాధనకు కృషి చేస్తానని, త్వరలోనే పార్టీ అధిష్ఠానాన్ని కలుస్తానన్నారు.