ఆస్తిపన్ను వసూళ్లలో GHMC టాప్​

ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది కంటే వసూళ్లను అధిగమించి అద్భుతమైన వసూళ్లను సాధించిందని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్​ రోస్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ. 257 కోట్లకు పైగా ఆస్తిపన్ను అదనంగా వసూలైందని తెలిపారు.
2023–2024 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల మేరకు రూ.1,810 కోట్లు కాగా, ఇప్పటివరకు 1,917 కోట్ల రూపాయల పన్ను వసూలైందన్నారు. గత సంవత్సరం2022-2023లో ఆస్తి పన్ను సేకరణ రూ. 1,660 కోట్లతో పోలిస్తే 15.5 శాతం పెరిగిందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకం అమలు ద్వారా ఆస్తి పన్ను పై 90 శాతం వడ్డీ మాఫీని ప్రారంభించడంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.

పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడంతో ఈ ఏడాది దాదాపు రూ.300 కోట్ల పన్నులు వసూలు అయ్యాయని తెలిపారు. చివరి రోజు రూ. 123 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు నమోదు అయిందని తెలిపారు. బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లు పలువురు బిఎల్‌ఓలు(BLO), బిఎల్‌ఓ సూపర్‌వైజర్ల వంటి కీలకమైన ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పటికీ లక్ష్యాన్ని అధిగమించామని తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిల వసూళ్లు సమిష్టి కృషితో సులభతరమైందని అన్నారు. బిల్ కలెక్టర్ లు, టాక్స్ ఇన్ స్పెక్టర్ లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల సహకారం, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో కేంద్ర పన్నుల విభాగం, ఐటి,ఆర్థిక విభాగాలు కీలకమైన పాత్ర పోషించాయని పేర్కొన్నారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *