CM Revanth Reddy : టీజర్​ బాగుంది..సినిమా యూనిట్​ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాచాల యుగంధర్ నిర్మాణంలో సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. హీరో గగన్ విహారి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే సీతా కళ్యాణ వైభోగమే సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ విడుదల చేసారు. ఈ సినిమా జూన్ 21న విడుదల కానుంది.

తాజాగా మూవీ టీమ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి సినిమా టీజర్, ట్రైలర్‌ను చూపించారు. సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్‌ను చూసిన ముఖ్యమంత్రి మూవీ యూనిట్‌ను అభినందించారు. ట్రైలర్ బాగుందని, సినిమా హిట్ అవ్వాలని అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నిర్మాత రాచాల యుగంధర్, డైరెక్టర్ సతీష్, నీరూస్ ప్రతినిధి అసీమ్, నటీనటులు సుమన్ తేజ్, గరీమ చౌహాన్, గగన్ విహారి.. పలువురు మూవీ టీమ్ సీఎంను కలిశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *